మంత్రి లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో ఒక్కరోజు అన్నప్రసాద వితరణ
ABN , Publish Date - Jan 23 , 2026 | 04:52 AM
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో...
రూ.44 లక్షలు విరాళంగా అందజేసిన భాష్యం రామకృష్ణ
గుంటూరు(విద్య)/తిరుమల, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. రాష్ట్ర అభివృద్థికి అహర్నిశలు కృషి చేస్తున్న లోకేశ్‌కు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు. శుక్రవారం మంత్రి లోకేశ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని టీటీడీ ఒక రోజు అన్నదానం నిమిత్తం భాష్యం రామకృష్ణ రూ.44 లక్షల విరాళాన్ని తిరుమలలో చైర్మన్ బీఆర్ నాయుడును గురువారం కలిసి అందజేశారు.