Share News

ప్రపంచాన్ని వాటి కళ్లతో చూడండి! జంతు దినోత్సవం సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌

ABN , Publish Date - Oct 05 , 2026 | 07:07 AM

ప్రపంచ జంతు దినోత్సవం-2026 సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు. ‘మనం ప్రపంచాన్ని వాటి కళ్లతో చూడగలిగితే.. ఏ పనులు భిన్నంగా చేస్తాం?’ అని ‘ఎక్స్‌’ వేదికగా పవన్‌ ప్రశ్నించారు.

ప్రపంచాన్ని వాటి కళ్లతో చూడండి!  జంతు దినోత్సవం సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌
pavankalyan

అమరావతి, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): ప్రపంచ జంతు దినోత్సవం-2026 సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు. ‘మనం ప్రపంచాన్ని వాటి కళ్లతో చూడగలిగితే.. ఏ పనులు భిన్నంగా చేస్తాం?’ అని ‘ఎక్స్‌’ వేదికగా పవన్‌ ప్రశ్నించారు. ‘ప్రపంచాన్ని వాటి కళ్లతో చూడండి అనే ఇతివృత్తం మన దృక్కోణాన్ని దాటి, అడవి లేదా పెంపుడు జంతువులైన ప్రతి జంతువు అవసరాలు, శ్రేయస్సు, గౌరవాన్ని గుర్తించమని మనకు పిలుపునిస్తోంది. ఈ రోజు మనం తీసుకునే నిర్ణయాలు అవి జీవించే ప్రపంచాన్ని తీర్చిదిద్దుతాయి. ఆవాసాలను రక్షించడం, క్రూరత్వాన్ని నివారించడం, జంతువుల పట్ల శ్రద్ధ వహించడం అనేవి ప్రతి జీవి పట్ల మనం ఉమ్మడి బాధ్యతకు నిదర్శనాలు. ఏపీలో విశాఖ, తిరుపతిలోని మన జంతు ప్రదర్శన శాలలు, జంతు దత్తత కార్యక్రమాల ద్వారా జంతు సంరక్షణ, పరిరక్షణలో ప్రజలు పాలుపంచుకునే అవకాశాన్ని అందిస్తున్నాయి. పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవం లేదా కుటుంబ వేడుక.. మరో జీవి పట్ల మన శ్రద్ధను చూపించే సందర్భంగా మారినప్పుడు మరింత అర్థవంతంగా ఉంటుంది. మన వేడుకలు కరుణ అనే వారసత్వాన్ని సృష్టించాలి. తమ గురించి తాము మాట్లాడలేని వారి తరఫున మన నిర్ణయాలే మాట్లాడాలి. ప్రపంచాన్ని వాటి కళ్లతో చూడండి’ అని పవన్‌కల్యాణ్‌ పిలుపునిచ్చారు.

Updated Date - Oct 05 , 2026 | 07:07 AM