ఆయిల్‌పామ్‌కు రికార్డు ధర.. ఏప్రిల్‌లో టన్ను రూ.23,656
ABN , Publish Date - May 03 , 2026 | 04:53 AM
రాష్ట్రంలో ఆయిల్‌పామ్ రైతులకు ఏప్రిల్‌లో రికార్డు స్థాయి ధర లభించింది. ఆయిల్‌పామ్ తాజా పండ్ల గెలలకు టన్ను ధర రూ.23,656గా నమోదైంది.
ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రంలో ఆయిల్‌పామ్ రైతులకు ఏప్రిల్‌లో రికార్డు స్థాయి ధర లభించింది. ఆయిల్‌పామ్ తాజా పండ్ల గెలలకు టన్ను ధర రూ.23,656గా నమోదైంది. ఆయిల్‌పామ్ చరిత్రలోనే ఇది అత్యధిక ధర అని ఉద్యాన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు శనివారం తెలిపారు. 2025 నవంబరు నుంచి 2026 అక్టోబరు (ఆయిల్ సంవత్సరం)వరకు చమురు వెలికితీత నిష్పత్తిని 20.01 శాతంగా, గింజలు 10.08 శాతంగా, టన్ను ముడి చమురు సగటు ధర 15.05 శాతంగా నిర్ధారించడం ద్వారా తాజా పండ్ల గెలల నికర ధర పెరిగింది. ఎకరం తోటలో 7-8 టన్నుల గెలలు దిగుబడి వస్తుంది. ఈ దిగుబడిని 9-10 టన్నులకు పెంచేందుకు ఉద్యాన శాఖ అధిక దిగుబడిని ఇచ్చే మొక్కలు, మైక్రో ఇరిగేషన్‌తో ఫర్టిగేషన్ పరికరాలను రైతులకు ఇస్తున్నారు. రైతులకు అదనపు ఆదాయం కోసం ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటలను ప్రోత్సహిస్తోంది.