అధికారులు సమన్వయంతో పనిచేయాలి
ABN , Publish Date - Jun 23 , 2026 | 12:03 AM
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరేవిదంగా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి సూచించారు.
ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి
ఆయా శాఖల అధికారులతో సమీక్ష
ప్రజలనుంచి వినతుల స్వీకరణ
ఎమ్మిగనూరు, జూన 22 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరేవిదంగా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి సూచించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం రెవెన్యూ, పీఆర్, ఇరిగేషన, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యా, పోలీసు, మున్సిపల్ అధికారులు ఎంపీడీవోలు, డీఈలు, ఏఈలు, ఎంఈవోలు, సీఐలతో సమీక్ష నిర్వహించారు.పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, రహదారులు, ట్రాఫిక్ నియంత్రణ, వనవే, సీసీ కెమెరాలు, వంటి అంశాలపై సమీక్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన పౌరసేవలు అందిలే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, కొత్తభవనాల నిర్మాణం, మురుగుదొడ్లు, తాగునీరు. ఫర్నీచర్‌తో పాటు విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. అలాగే పీఆర్, ఎల్‌ఎల్‌సీ అధికారులతో ఆయా శాఖల్లో చేపట్టిన పనుల పురోభివృద్ధిపై సమీక్షించారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అంతర్గత రహదారులు, చెరువుల పునరుద్ధరణ, సాగునీటి కాలువుల నిర్వహాణ, భూగర్భ జలాల పెంపుపై అధికారులతో సమీక్షించారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఎమ్మిగనూరు, గోనేగండ్ల, నందవరం మండలాల అధికారులు, మున్సిపల్ కమీషనర్ గంగిరెడ్డి, సీఐ కంబగిరి రాముడు, డీఈ చంద్రశేఖర్, డీఈ విద్యాసాగర్, ఎంపీడీఓ బంగారమ్మలు పాల్గొన్నారు.
ప్రజా సమస్యను సత్వరమే
పరిష్కరించాలి: ఎమ్మెల్యే బీవీ
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలనుంచి వచ్చిన సమస్యలను ఆయా శాఖల అధికారులు సత్యవరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఎమ్మెల్యేకు వినతిపత్రాలు అందజేశారు. మండలాల్లో భూసమస్యలు, సీఎంఆర్‌ఎఫ్ దరఖాస్తులు, రోడ్లు, పింఛన్లు, విద్యుత సమస్యలకు సంబందించిన వినతిపత్రాలు వచ్చాయి. ఈ వినతులను ఆయా శాఖల అధికారులకు పరిష్కానిమిత్తం పంపారు.