బాల చెంచుమ్మ తల్లికి సారె సమర్పణ
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:52 AM
మండలంలోని గర్నికం బాల చెంచుమ్మ తల్ల్లికి భక్తులు సోమవారం సారె సమర్పించారు. కలశాలు, సారెతో ఊరేగింపుగా వెళ్లి వారంతా అమ్మవారిని దర్శించుకున్నారు.
రావికమతం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గర్నికం బాల చెంచుమ్మ తల్ల్లికి భక్తులు సోమవారం సారె సమర్పించారు. కలశాలు, సారెతో ఊరేగింపుగా వెళ్లి వారంతా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి తీర్థం ఈ నెల 25న జరగనున్నది. దీనిని పురస్కరించుకుని గ్రామంలో 250 మంది భక్తులు అమ్మవారి మాలాధారణ చేసి గత 21 రోజులుగా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. బుధవారంతో దీక్ష పూర్తి కానుండడం, అదే రోజున తీర్థ మహోత్సవం ఉండడంతో మాలధారణ చేసిన భక్తులు, గ్రామస్థులు ప్రతి ఇంటి నుంచి కలశాలు, వివిధ రకాల పిండి వంటలతో పాటు సారెను ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు.