దేవాలయ స్థలాలను కబ్జా చేస్తే సహించేది లేదు
ABN , Publish Date - Feb 07 , 2026 | 11:50 PM
దేవాలయాలకు సంబంధించిన స్థలాలను కబ్జా చేస్తే సహించేది లేదని విశ్వహిందూ పరిషత దక్షిణాంధ్ర ప్రాంత అధ్యక్షుడు నంది రెడ్డి సాయి రెడ్డి హెచ్చరించారు.
ఆదోని టౌన, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి) : దేవాలయాలకు సంబంధించిన స్థలాలను కబ్జా చేస్తే సహించేది లేదని విశ్వహిందూ పరిషత దక్షిణాంధ్ర ప్రాంత అధ్యక్షుడు నంది రెడ్డి సాయి రెడ్డి హెచ్చరించారు. శనివారం ఎమ్మిగనూరు ప్రాంతంలోని భక్తాంజనేయ స్వామి దేవాలయాన్ని వీహెచపీ నాయకులతో కలిసి సందర్శించారు. అనంతరం ఆదోనిలో విలేకరులతో మాట్లాడుతూ సర్వే నెంబర్ 321లో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి సంబంధించిన 32 సెంట్ల స్థలాన్ని కొందరు కూటమి నాయకులమని చెప్పుకుంటూ ఆక్రమించి దుకాణాలను నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. దేవాలయ స్థలాలను ఎట్టి పరిస్థితులలో అన్యాక్రాంతం కాకుండా చూస్తామన్నారు. వీహెచపీ దక్షణాంధ్ర ప్రాంత విశేష సంపర్క్ ప్రముఖ్ ప్రతాప్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బసన్న గౌడ్, శ్రీశైలం బోర్డు చైర్‌పర్సన విరుపాక్షి స్వామి, జిల్లా ప్రచార కార్యదర్శి కసిరెడ్డి ఉపేందర్ రెడ్డి, జిల్లా గోరక్షప్రముఖ్ శ్రీరాములు యాదవ్ పాల్గొన్నారు.