నూజివీడు ట్రిపుల్ ఐటీలో ముగ్గురు అధ్యాపకుల సస్పెన్షన్
ABN , Publish Date - Apr 15 , 2026 | 05:16 AM
నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థినులను వేధింపులకు గురిచేసిన ముగ్గురు అధ్యాపకులను సస్పెండ్ చేస్తున్నట్టు డైరెక్టర్ గోపాల్‌రాజు ఉత్తర్వులు జారీచేశారు.
విద్యార్థినులపై వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఉత్తర్వులు
నూజివీడు, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థినులను వేధింపులకు గురిచేసిన ముగ్గురు అధ్యాపకులను సస్పెండ్ చేస్తున్నట్టు డైరెక్టర్ గోపాల్‌రాజు ఉత్తర్వులు జారీచేశారు. రసాయన, ఐటీ, ఇంగ్లిష్ విభాగాలకు చెందిన అధ్యాపకులు కృష్ణ, భీమరాజు, రాజేశ్ తమను వేధిస్తున్నట్టు విద్యార్థినులు ఆరోపించారు. ఈ అంశంపై ఏ విధమైన చర్యలు తీసుకోకుండా క్యాంప్‌సలోని కొందరు అధికారులు తొక్కిపెట్టారు. కొద్ది రోజుల క్రితం డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన గోపాల్‌రాజు దృష్టికి విద్యార్ధినులు ఈ విషయం తీసుకువెళ్లారు. మరోవైపు ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తేవడంతో ఎస్పీ కిశోర్ ఇంటెలిజెన్స్ అధికారులను క్యాంప్‌సకు పంపి వాస్తవాలు తెలుసుకున్నారు. దీనిపై సుమోటోగా కేసు నమోదు చేసేందుకు యోచిస్తున్నారు. మరోవైపు.. కేసు నమోదు కాకుండా కొందరు ట్రిబుల్ ఐటీ అధికారులు అధికార పార్టీ నాయకుల చుట్టూ తిరుగుతున్నారు.