Nukasani Balaji: విద్యుత్తు రంగాన్ని కూటమి ప్రక్షాళన చేస్తోంది: నూకసాని బాలాజీ
ABN , Publish Date - Jan 03 , 2026 | 06:29 AM
విద్యుత్తు చార్జీలను పెంచకూడదన్న సీఎం చంద్రబాబు హామీ మేరకు రూ.4,498 కోట్లు ట్రూ అప్ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించేందుకు సిద్ధమైందని ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని..
అమరావతి, జనవరి 2(ఆంధ్రజ్యోతి): విద్యుత్తు చార్జీలను పెంచకూడదన్న సీఎం చంద్రబాబు హామీ మేరకు రూ.4,498 కోట్లు ట్రూ అప్ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించేందుకు సిద్ధమైందని ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యుత్తు రంగాన్ని కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేస్తోందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలపై విద్యుత్తు భారం పడకుండా చూస్తుందని అన్నారు. జగన్ తన ఐదేళ్ల పాలనలో 9 సార్లు విద్యుత్తు చార్జీలను పెంచి సుమారు రూ.32 వేల కోట్లను ప్రజలపై భారం వేశాడని అన్నారు. జగన్ పాలనలో ఆక్వా రైతులకు యూనిట్ రూ.3.50 వసూలు చేస్తే, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత యూనిట్‌కు రూ.1.50కు తగ్గిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. జగన్ హయాంలో యూనిట్ విద్యుత్తు రూ.5.19కు కొనుగోలు చేస్తే, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.4.70కు కొనుగోలు చేస్తోందని నూకసాని అన్నారు.