Share News

ఎన్టీఆర్‌ పార్కు అభివృద్ధి పనులకు శ్రీకారం

ABN , Publish Date - Apr 06 , 2026 | 04:58 AM

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలోని ఎన్టీఆర్‌ పార్కు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదివారం శంకుస్థాపన చేశారు.

ఎన్టీఆర్‌ పార్కు అభివృద్ధి పనులకు శ్రీకారం

  • శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి

  • ‘అక్షరం అండగా’ కార్యక్రమానికి స్పందన

తణుకు, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలోని ఎన్టీఆర్‌ పార్కు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదివారం శంకుస్థాపన చేశారు. ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఆధ్వర్యంలో ‘అక్షరం అండగా- పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం గత నెల 31న తణుకులో జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ పార్కును అభివృద్ధి చేయాలని ప్రజలు కోరారు. ఈమేరకు పార్కు అభివృద్ధికి రూ.2.5 కోట్లు కేటాయించినట్లు తెలిపిన ఎమ్మెల్యే, రూ.94.5 లక్షలతో మొదటి దశ పనులకు ఆదివారం శ్రీకారం చుట్టారు. మొదటి విడతగా పార్కులో జిమ్‌ పరికరాలు, ఓపెన్‌ జిమ్‌, చిల్డ్రన్‌ జిమ్‌, సీనియర్‌ సిటిజన్‌ జిమ్‌లు ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ పట్టణంలోని 25 పార్కులను యువతకు ఉపయోగపడేవిధంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రుపొందించినట్టు తెలిపారు.

Updated Date - Apr 06 , 2026 | 05:00 AM