నేటి నుంచి వైద్యం బంద్
ABN , Publish Date - Apr 01 , 2026 | 05:58 AM
ఎన్టీఆర్ వైద్య సేవ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో బుధవారం నుంచి వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి వైద్య సేవలు అందించలేమని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్...
నేడు ‘ఆషా’తో ఆరోగ్యశాఖ కార్యదర్శి చర్చలు
అమరావతి, మార్చి 31(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ వైద్య సేవ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో బుధవారం నుంచి వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి వైద్య సేవలు అందించలేమని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ఆషా) వైద్యసేవ ట్రస్ట్ సీఈవోకు గురువారం లేఖ రాసింది. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వైద్య సేవలు నిలుపుదల చేసేందుకు సిద్ధమైంది. నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఓపీ, ఐపీ సేవలతో పాటు ఎమర్జెన్సీ సేవలు కూడా నిలిపివేయనుంది. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన రూ.3000 కోట్ల బకాయిలు చెల్లించడంతో పాటు ప్యాకేజీలు పెంచాలని డిమాండ్ చేసింది. మరోవైపు ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్.. బుధవారం ఉదయం 11 గంటలకు చర్చలకు రావాలని ఆషా ప్రతినిధులను ఆహ్వానించారు.