పింఛన్ల పంపిణీ నేడే
ABN , Publish Date - Jan 31 , 2026 | 05:22 AM
ప్రతినెలా 1వ తేదీన పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగా(జనవరి 31) పంపిణీ చేయనున్నట్టు సెర్ప్ మంత్రి కొండపల్లి.....
ఒక రోజు ముందే భరోసా పెన్షన్లు: మంత్రి కొండపల్లి
అమరావతి, జనవరి 30(ఆంధ్రజ్యోతి): ప్రతినెలా 1వ తేదీన పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగా(జనవరి 31) పంపిణీ చేయనున్నట్టు సెర్ప్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. కొత్తగా మంజూరైన వితంతువుల పెన్షన్లు 7,944తో కలిపి మొత్తం 62.94 లక్షల మంది పెన్షన్‌దారులకు రూ.2,724 కోట్లు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దే అందజేస్తారని పేర్కొన్నారు. ఏదైనా కారణంతో జనవరి 31న పింఛను సొమ్ము అందుకోని వారు ఫిబ్రవరి 2న తీసుకోవచ్చని పేర్కొన్నారు. కాగా, శనివారం ఉదయం కుప్పంలోని గుడుపల్లె మండలం బెగ్గిలిపల్లె గ్రామ పంచాయతీలో సీఎం చంద్రబాబు లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేయనున్నారు.