తిరుమలలో ఎన్‌ఎస్‌జీ మాక్‌డ్రిల్
ABN , Publish Date - Mar 06 , 2026 | 04:32 AM
భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్‌ఎస్‌జీ ) బృందం తిరుమలలో ...
శ్రీవారి ఆలయం, పద్మావతి అతిథి గృహంలో నిర్వహణ
తిరుమల, మార్చి 5(ఆంధ్రజ్యోతి): భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్‌ఎస్‌జీ ) బృందం తిరుమలలో మాక్‌డ్రిల్ నిర్వహించింది. శ్రీవారి ఆలయ సమీపంలో ఓ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసుకుని.. ఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో దాదాపు 160 మంది ఎన్‌ఎస్‌జీ బృందంతో పాటు 30 మంది జిల్లా పోలీసు, విజిలెన్స్ అధికారులు బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం వేకువజాము వరకు ఈ మాక్‌డ్రిల్‌లో పాల్గొన్నారు.