అమెరికా నుంచి వచ్చి ఓటు!
ABN , Publish Date - Nov 02 , 2026 | 06:32 AM
రాజ్యాంగం పట్ల గౌరవం, చంద్రబాబుపై ఉన్న అభిమానంతో నందిగామ మున్సిపల్ ఎన్నికల్లో ఓటేయడానికి తాను అమెరికా నుంచి వచ్చినట్టు ప్రవాస భారతీయుడు వాసిరెడ్డి వంశీకృష్ణ తెలిపారు.
నందిగామ, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగం పట్ల గౌరవం, చంద్రబాబుపై ఉన్న అభిమానంతో నందిగామ మున్సిపల్ ఎన్నికల్లో ఓటేయడానికి తాను అమెరికా నుంచి వచ్చినట్టు ప్రవాస భారతీయుడు వాసిరెడ్డి వంశీకృష్ణ తెలిపారు. న్యూజెర్సీలో నివాసం ఉండే వంశీకృష్ణ హైదరాబాద్ విమానాశ్రయంలో దిగి.. రోడ్డుమార్గంలో నేరుగా 9వ వార్డులోని పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ప్రతి ఎన్నికల్లోనూ తన ఓటును వినియోగించుకుంటున్నట్లు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు