Share News

ఎన్‌ఆర్‌ఐకు డీమ్డ్‌ టూ బీ యూనివర్సిటీ హోదా

ABN , Publish Date - Mar 26 , 2026 | 03:49 AM

ఏలూరు జిల్లా ఆగిరిపల్లి వద్ద ఉన్న ఎన్‌ఆర్‌ఐ విద్యాసంస్థలకు యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌ (యూజీసీ) న్యూఢిల్లీ డీమ్డ్‌ టూ బీ యూనివర్సిటీ హోదా దక్కింది.

ఎన్‌ఆర్‌ఐకు డీమ్డ్‌ టూ బీ యూనివర్సిటీ హోదా

  • సంస్థ ప్రతినిధులకు అందజేసిన సీఎం చంద్రబాబు

విజయవాడ కల్చరల్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా ఆగిరిపల్లి వద్ద ఉన్న ఎన్‌ఆర్‌ఐ విద్యాసంస్థలకు యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌ (యూజీసీ) న్యూఢిల్లీ డీమ్డ్‌ టూ బీ యూనివర్సిటీ హోదా దక్కింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను బుధవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఆ సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ ఆర్‌.వెంకట్రావు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2007లో ఎన్‌ఆర్‌ఐ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మశీ, 2008లో ఎన్‌ఆర్‌ఐ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ స్థాపనతో ప్రారంభమైన విద్యాసంస్థలు, 2018లో అటానమస్‌ హోదా సాధించి, నాక్‌ ‘ఏ’ గ్రేడ్‌, ఎన్‌బీఏ టైర్‌-వన్‌ అక్రిడిటేషన్లను పొందుతూ దశలవారీగా అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. సీఈవో ఎం.తేజ్‌సాయి మాట్లాడుతూ 2026లో డీమ్డ్‌ టూ బీ యూనివర్సిటీ హోదా పొందడం సంస్థకు మరో మైలురాయి అన్నారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి డాక్టర్‌ ఆర్వీఆర్‌ ఎన్‌ఆర్‌ఐఐటీ డీమ్డ్‌ యూనివర్సిటీగా బీటెక్‌, ఎంటెక్‌, బీ ఫార్మసీ, ఎంబీఏ తదితర కోర్సుల్లో ప్రవేశాలు ప్రారంభమవుతాయని తెలిపారు. అకడమిక్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ గుత్తా సాంబశివరావు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సి.నాగభాస్కర్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2026 | 03:49 AM