Share News

ఇక సంగ్రామం

ABN , Publish Date - Nov 10 , 2026 | 11:39 PM

పట్టణ స్థానిక సంస్థలు, పరిషత ఎన్నికలు ముగిశాయి. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరగడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

ఇక సంగ్రామం

13 నుంచి ఎన్నికల ప్రక్రియ షురూ

మూడు విడతల్లో నిర్వహణ

జిల్లాలో 484 పంచాయతీలు, 5,100 వార్డులు

పట్టణ, పరిషత ఎన్నికల్లో విజయంతో జోష్‌లో కూటమి

పల్లె పోరులైనా పరువు కోసం వైసీపీ

గ్రామసీమల్లో అసలైన రాజకీయం

కర్నూలు, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): పట్టణ స్థానిక సంస్థలు, పరిషత ఎన్నికలు ముగిశాయి. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరగడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఇక గ్రామ పంచాయతీ ఎన్నిలకు అధికార యంత్రాంగం సన్నద్ధం అవుతోంది. జిల్లాలో 484 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. మూడు విడతల్లో నిర్వహించేందుకు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్రపునేఠా షెడ్యూల్‌ జారీ చేశారు. ఈ నెల 13న సం‘గ్రామం’ సైరన మోగనుంది. పుర, పరిషత ఎన్నికల్లో అఖండ విజయాలతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయోత్సవాలు జరుపుకుంటుంది. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కాకపోయినా.. పల్లెసీమల్లో పట్టుండే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సైతం సత్తా చాటేందుకు కూటమి నేతలు అస్త్రశసా్త్రలను సిద్ధం చేసుకుంటున్నారు. పరిషత ఎన్నికల్లో బోల్తా పడినా.. పంచాయతీల్లోనైనా పరువు కాపాడుకునేలా స్థానాలు దక్కించుకోవాలని వైసీపీ వ్యూహాలకు పదును పెడుతోంది. అదే క్రమంలో మండలాధీశులు, జడ్పీ చైర్మన ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన జారీ చేయడంతో, జడ్పీ చైర్మన పీఠం కోసం ఆశావహులు విజయవాడకు పరుగులు పెట్టారు.

జిల్లాలో కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ, పాణ్యం నియోజకవర్గాల పరిధిలో 484 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటి పరిధిలో 5,100 వార్డులు ఉన్నాయి. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహణలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అక్టోబరు 14న షెడ్యూల్‌ జారీ చేసింది. అందులో భాగంగా ఇప్పటికే పట్టణ స్థానిక సంస్థలు, మండల, జిల్లా పరిషత ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక మిగిలింది గ్రామ పంచాయతీ ఎన్నికలే. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహణకు షెడ్యూల్‌ జారీ చేశారు. ఈ నెల 13న తొలి విడత ఆదోని డివిజన, 16న రెండవ విడత పత్తికొండ, 19న మూడవ విడత కర్నూలు డివిజన పరిధిలోని గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫిషన జారీ చేస్తారు. మూడు విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ డిసెంబరు 3న ముగుస్తుంది.

ఫ బీసీలకు 137 పంచాయతీలు

జిల్లాలో 484 పంచాయతీల రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారు చేశారు. అన రిజర్వుడు (ఓసీ) జనరల్‌ 125, మహిళలకు 124, బీసీ జనరల్‌ 67, మహిళలకు 70, ఎస్సీ జనరల్‌ 44, మహిళలకు 45, ఎస్టీ జనరల్‌ 6, మహిళలకు 3 పంచాయతీ సర్పంచ పదువులు రిజర్వేషన చేశారు. ఆమేరకు ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి ఆధ్వర్యంలో పకడ్భందిగా ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 49 సర్పంచ స్థానాలు కేటాయిస్తే,, మొత్తం సర్పంచుల్లో 50 శాతం మహిళలకు కేటాయించారు.

ఫ గ్రామీణ ఓటర్లు 12.50 లక్షలు

గ్రామ పంచాయతీల పాలకవర్గాలను ఎన్నుకునేందుకు గ్రామీణ ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. 26 మండలాలు, 484 గ్రామ పంచాయతీల పరిధిలో 12,50,166 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 4,49,087, మహిళలు 4,56,520, ఇతర ఓటర్లు 109 మంది ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే సామాజికవర్గాల వారీగా ఓటర్లను విడదీశారు. ఆ లెక్కలు పరిశీలిస్తే.. జిల్లాలో బీసీ ఓటర్లు 9,05,611, ఎస్సీ ఓటర్లు 2,33,881, ఎస్టీ ఓటర్లు 17,119 మంది ఉండగా, ఇతర సామాజికవర్గం ఓటర్లు 93,555 మంది ఉన్నారు. అంటే.. మొత్తం ఓటర్లలో బీసీలు 72 శాతానికి పైగా ఉన్నారు. పల్లె సీమల్లో పంచాయతీ సర్పంచగా ఎన్నిక కావాలంటే బీసీ సామాజికవర్గం ఓటర్లు ఇచ్చే తీర్పే కీలకం కానుంది.

ఫ సిద్ధమవుతున్న పార్టీలు

నాలుగు పట్టణ స్థానిక సంస్థలు, 26 జడ్పీటీసీలు, 432 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు, ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. సీఎం చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆఖండ విజయోత్సవాలతో దూసుకుపోతోంది. ఈ నెల 13న ప్రారంభమైన గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ అదే పరంపర కొనసాగించేందుకు సర్వం సిద్ధం అవుతోంది. పుర, పరిషత పోరులో అలుపెరగని రాజకీయ పోరాటం చేసిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇనచార్జిలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. పంచాయతీ పోరుకు సై అంటున్నారు. అదే క్రమంలో పరిషత, పట్టణ ఎన్నికల్లో ఘోర పరాజయంతో రగిలిపోతున్న వైసీపీ నాయకులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనైనా తమ మద్ధతుదారులతో గౌరవప్రదమైన స్థానాలను దక్కించుకుని ఉనికి కాపాడుకోవడానికి ఎత్తులు వేస్తోంది. పార్టీ గుర్తులు లేకుండా జరిగే ఎన్నికలు కావడంతో అన్ని పల్లెల్లో అభ్యర్థులను నిలపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పల్లెల్లో బలమైన పట్టుండే ఎన్నికలు కావడంతో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీలు పట్టు కోసం రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

Updated Date - Nov 10 , 2026 | 11:39 PM