Share News

దూరదర్శన్‌లో స్ట్రింగర్లకు నోటిఫికేషన్‌

ABN , Publish Date - Jan 24 , 2026 | 06:00 AM

అన్ని జిల్లాల్లో వార్తల సేకరణకు జిల్లా ప్రతినిధుల(స్ర్టింగర్లు) ఎంప్యానల్‌మెంట్‌కు నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు విజయవాడ...

దూరదర్శన్‌లో స్ట్రింగర్లకు నోటిఫికేషన్‌

అమరావతి, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): అన్ని జిల్లాల్లో వార్తల సేకరణకు జిల్లా ప్రతినిధుల(స్ర్టింగర్లు) ఎంప్యానల్‌మెంట్‌కు నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు విజయవాడ డీడీకే హెడ్‌ ఆఫ్‌ న్యూస్‌ షఫీ మహమ్మద్‌ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలో జరిగే వార్తలు, ప్రస్తుత వ్యవహారాలు, క్రీడలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల సమాచారాన్ని సేకరించి దూరదర్శన్‌కు అందించాల్సి ఉంటుందన్నారు. ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులను విజయవాడలోని ప్రాంతీయ వార్త విభాగంలో సమర్పించాలని, నోటిఫికేషన్‌ కోసం ప్రసారభారతి వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Updated Date - Jan 24 , 2026 | 06:00 AM