Share News

ప్రాణాలైనా ఇస్తాం..

ABN , Publish Date - Jul 22 , 2026 | 12:07 AM

ప్రాణాలైనా అర్పిస్తాం గాని.. తమ సారవంతమైన భూములు రిజర్వాయర్‌ నిర్మాణానికి ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు తేల్చి చెప్పారు. మంగళవారం మండలంలోని మీదివేముల గ్రామంలో రిజర్వాయర్‌ నిర్మాణానికి తహసీల్దార్‌ విద్యాసాగర్‌ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు.

ప్రాణాలైనా ఇస్తాం..
మీదివేములలో అధికారులతో వాగ్వాదం చేస్తున్న రైతులు

భూములిచ్చే ప్రసక్తే లేదు

అధికారులకు తేల్చి చెప్పిన రైతులు

ఓర్వకల్లు, జూలై 21 (ఆంధ్రజ్యోతి): ప్రాణాలైనా అర్పిస్తాం గాని.. తమ సారవంతమైన భూములు రిజర్వాయర్‌ నిర్మాణానికి ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు తేల్చి చెప్పారు. మంగళవారం మండలంలోని మీదివేముల గ్రామంలో రిజర్వాయర్‌ నిర్మాణానికి తహసీల్దార్‌ విద్యాసాగర్‌ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామసభకు రైతులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. రిజర్వాయర్‌ నిర్మాణానికి 250 ఎకరాల భూమి అవసరం అని అధికారులు రైతులకు, ప్రజలకు తేల్చి చెప్పడంతో సారవంతమైన భూములు రిజర్వాయర్‌ నిర్మాణానికి ఇచ్చేప్రసక్తే లేదని అధికారులతో రైతులు ప్రజలు వాగ్వివాదానికి దిగారు. గతంలో ఏపీఐఐసీకి తమ భూములు పరిశ్రమలకు ఇచ్చామని, ఉన్న భూమిని సాగు చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నామని, ఆ భూములు కూడా రిజర్వాయర్‌కు ఇస్తే తాము ఎక్కడకు వెళ్లాలని రైతులు అధికారులతో మొర పెట్టుకున్నారు. భూములకు ఎంత నష్టపరిహారం ఇచ్చినా తాము రిజర్వాయర్‌ నిర్మాణానికి భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గ్రామస్థుందరికీ విషమిచ్చి చంపిన తర్వాతనే రిజర్వాయర్‌ చేపట్టండని తేల్చి చెప్పారు. చేసేదేమీ లేక అధికారులు వెనుదిరిగి వెళ్లారు. సర్వేయర్‌ శంకర్‌ మాణిక్యం, ఆయా శాఖ అధికారులు, గ్రామ రైతులు పాల్గొన్నారు.

Updated Date - Jul 22 , 2026 | 12:07 AM