పోటాపోటీగా నామినేషన్లు
ABN , Publish Date - Nov 17 , 2026 | 12:13 AM
ఆదోని మండలం-1,2లలో పం చాయతీ సర్పంచులకు, వార్డు మెంబర్లకు నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు పోటీ పడ్డారు.
పర్యవేక్షించిన ఆర్డీవో అరుణాదేవి,
ఎన్నికల స్పెషల్ అధికారులు
పోలీసుల భారీ బందోబస్తు
ఆదోని/ ఆదోని రూరల్/ అగ్రికల్చర్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : ఆదోని మండలం-1,2లలో పం చాయతీ సర్పంచులకు, వార్డు మెంబర్లకు నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు పోటీ పడ్డారు. ఆదోని-1 పరిఽధిలో 21 గ్రామ పంచాయతీలకు ఎనిమిది నామినేషన కేంద్రాలను ఏర్పాటు చేయగా, సర్పంచుకు 69మంది, వార్డుమెంబర్‌కు 142మంది, ఆదోని-2 పరిధిలో 19 గ్రామ పంచాయతీలకు తొమ్మిది నామినేషన కేంద్రాలను ఏర్పాటు చేయ గా, 62మంది సర్పంచులకు 235మంది వార్డుమెంబర్లకు నామినేషన్లు వేశారు. మొత్తంగా మండలాల్లో 40 పంచాయతీ సర్పంచులకు 207మంది, 402 వార్డులకు 473మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఎప్పటికప్పుడు సంబంధిత సిబ్బంది నా మినేషన దాఖలైన పత్రాలను ఆనలైనలో పొందుపర్చారు. నామినేషన ప్రక్రియను ఆర్డీవో అరుణాదేవి, ఎన్నికల స్పెషల్ అధికారులు వేణుగోపాల్‌రావు, పద్మనాభరెడ్డి, శ్రీలత, ఎంపీడీవో నాగరాజు స్వామి, డిప్యూటీ ఎంపీడీవో నాగరాజులు తదితర సిబ్బంది పర్యవేక్షించారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రూరల్ సీఐ నల్లప్ప ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు.
ఆలూరు మండలంలో..
ఆలూరు: ఆలూరు మండలంలో 16 గ్రామ పంచాయతీలకు రెండోరోజు సోమవారం నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. మండలంలో మొత్తం 380 మంది సర్పంచ్ స్థానాలకు, 796 మంది వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు వేసినట్లు ఎంపీడీవో మద్దిలేటిస్వామి తెలిపారు. మంగళవారం చివరిరోజు కావడంతో నామినేషన్లు పెరిగే అవకాశం ఉందన్నారు. అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి, మాజీ ఇన్‌చార్జి వైకుంఠం శివప్రసాద్, జడ్పీటీసీ కొమ్ము రామాంజనేయులు, ఎంపీపీ అభ్యర్థి వైకుంఠం శ్రీరాములు హాజరయ్యారు.
దేవనకొండ మండలంలో..
దేవనకొండ : మండలంలోని రెండవ రోజు జోరుగా అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 26 గ్రామ పంచాయతీలకు గాను పది క్లస్టర్ల పరిధిలో సర్పంచు అభ్యర్థులుగా 92 మంది, 314 మంది వార్డు నెంబర్ అభ్యర్థులుగా నామినేషన వేశారు.
ఆస్పరి మండలంలో..
ఆస్పరి: మండలంలో సోమవారం రెండో రోజు సర్పంచ్ అభ్యర్థులుగా 69 మంది, వార్డు మెంబర్లుగా 78 మంది నామినేషన్లు వేసినట్లు ఎంపీడీవో గీతావాణి తెలిపారు. నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు అన్నారు.
హాలహర్వి మండలంలో..
హాలహర్వి: మండలంలో సర్పంచ స్థానాలకు 51మంది అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లు సంబంధిత ఎన్నికల అధికారులు తెలిపారు. అలాగే వార్డు సభ్యులకు 78మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారన్నారు.
హొళగుంద మండలంలో..
ఆలూరు రూరల్ (హొళగుంద): హొళగుంద మండలంలోని 17 గ్రామ పంచాయతీలకు సోమవారం రెండో రోజు 59 మంది సర్పంచ్ స్థానాలకు, 120 మంది వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు సమర్పించారని ఎంపీడీవో సయ్యద్ ఉమర్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ దిలీ్‌పకుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.