CS Vijayanand: ప్రభుత్వ శాఖల్లో ‘నోడల్’ విధానం!
ABN , Publish Date - Jan 11 , 2026 | 04:49 AM
ఉద్యోగుల సౌకర్యార్థం ప్రభుత్వం కొత్తగా నోడల్ అధికారుల విధానాన్ని తెరపైకి తీసుకువచ్చింది.
అమరావతి, జనవరి 10(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల సౌకర్యార్థం ప్రభుత్వం కొత్తగా నోడల్ అధికారుల విధానాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల దగ్గర నుంచి అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే కిందస్థాయి ఉద్యోగి వరకూ అందరికీ మేలు జరిగేలా ఈ విధానాన్ని తీసుకువచ్చారు. ఒక ఉద్యోగికి తన ఉద్యోగంలో భాగంగా సమయనికి అనుగుణంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ మొత్తం అందించడమే నోడల్ అధికారులు బాధ్యత. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఉద్యోగుల సమస్యలకు దాదాపు పరిష్కారం దొరుకుతుంది. దీనిని అన్ని శాఖల్లో అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.