Secretary Surya Kumari: దివ్యాంగుల హక్కుల అమలుకు నోడల్ అధికారి
ABN , Publish Date - Jan 09 , 2026 | 05:48 AM
రాష్ట్రంలో దివ్యాంగుల హక్కుల పరిరక్షణ, అమలు పర్యవేక్షణకు ప్రభుత్వం నోడల్ అధికారిగా రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి సూర్యకుమారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది...
అమరావతి, జనవరి 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో దివ్యాంగుల హక్కుల పరిరక్షణ, అమలు పర్యవేక్షణకు ప్రభుత్వం నోడల్ అధికారిగా రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి సూర్యకుమారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దివ్యాంగుల రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేటు సంరక్షణ కేంద్రాల్లో నివసిస్తున్న మానసిక వైకల్యాలు ఉన్న దివ్యాంగుల రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను సమర్థవంతంగా అమలు చేయడం, వారు గౌరవం, హక్కులు, అందుబాటులో సదుపాయాలు, సమాజంలో సమగ్ర భాగస్వామ్యాన్ని నిర్థారించడమే లక్ష్యంగా ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.