Share News

నో స్టాక్‌ బోర్డులు

ABN , Publish Date - Mar 18 , 2026 | 01:05 AM

కోసిగిలోని మూడు పెట్రోల్‌ బంకుల్లో స్టాక్‌ లేకపోవడంతో యాజమాన్యాలు చేతులెత్తేసి బంకులను మూసేసి నోస్టాక్‌ బోర్డులు పెట్టేశాయి.

   నో స్టాక్‌ బోర్డులు
కోసిగి ఇండియన పెట్రోల్‌ బంకులో నోస్టాక్‌ బోర్డు పెట్టిన వైనం

ఖాళీ పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు

మూతపడిన మూడు పెట్రోల్‌ బంకులు

ఇబ్బందుల్లో వాహనదారులు

కోసిగి, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): కోసిగిలోని మూడు పెట్రోల్‌ బంకుల్లో స్టాక్‌ లేకపోవడంతో యాజమాన్యాలు చేతులెత్తేసి బంకులను మూసేసి నోస్టాక్‌ బోర్డులు పెట్టేశాయి. వాహనదారులు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు మంగళవారం ఇబ్బందులు పడ్డారు. ఆదోని రోడ్డులోని ఇండియన ఆయిల్‌, ఎమ్మిగనూరు రోడ్డులోని హెచపీ, ఉరకుంద రోడ్డులోని ఏసర్‌ పెట్రోల్‌ బంకులో నిల్వ అయిపోయాయి. ఉరుకుంద ఈరన్న స్వామి దర్శనార్థం వెళ్లే వాహనాదారులు పెట్రోల్‌ లేక మధ్యలోనే ఆగిపోయారు. బంకుల యాజమాన్యాల బాధ్యతా రాహిత్యంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోసిగిలో బంకులు మూసిన విషయం తెలుసుకున్న అక్రమ నిల్వదారులు, చిరు వ్యాపారులు అక్రమ దందాకు తెరలేపారు. లీటర్‌ పెట్రోల్‌ను రూ.150 వరకు అమ్ముతూ వాహనదారుల జేబులకు చిల్లులు వేస్తున్నారు. పెట్రోల్‌ బంకులో నిరంతరం స్టాక్‌ ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Mar 18 , 2026 | 01:05 AM