టైగర్ రొయ్యల్లో టీపీడీ నిర్ధారణ కాలేదు: మత్స్యశాఖ
ABN , Publish Date - Apr 21 , 2026 | 04:31 AM
టైగర్ రొయ్యల్లో ట్రాన్స్‌లూసెంట్ పోస్ట్- లార్వే డిసీజ్(టీపీడీ)పై ఆక్వా రైతులు ఆందోళన చెందనవసరం లేదని, దేశంలో ఈ తరహా కేసులు ఎక్కడా నమోదు కాలేదని...
అమరావతి, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): టైగర్ రొయ్యల్లో ట్రాన్స్‌లూసెంట్ పోస్ట్- లార్వే డిసీజ్(టీపీడీ)పై ఆక్వా రైతులు ఆందోళన చెందనవసరం లేదని, దేశంలో ఈ తరహా కేసులు ఎక్కడా నమోదు కాలేదని మత్స్యశాఖ కమిషనర్ రాంశంకర్‌నాయక్ తెలిపారు. టీపీడీపై ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఫార్మ్‌లు, హేచరీస్ నుంచి సేకరించిన నమూనాల్లో టీపీడీ పాజిటీవ్‌గా తేలలేదని ప్రకటించారు. ఆక్వా రైతులు, నిర్వాహకులు, జాతీయ సంస్థల ప్రతినిధులతో టీపీడీపై కమిషనర్ సోమవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో టీపీడీ ఉన్నట్లు శాస్త్రీయ ఆధారాలు లేవని, టైగర్ రొయ్య మరణాలకు వైట్‌స్పాట్ సిండ్రోమ్ వైరస్, విబ్రియో ఇన్ఫెక్షన్లు, అధిక ఉష్ణోగ్రతలు కారణమని చెప్పారు.