Share News

ఈ సర్కారు బడిలో సీట్లు లేవు!

ABN , Publish Date - Jul 03 , 2026 | 06:23 AM

ఇది కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలంలోని మూలపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల. ఈ యేడాది పదో తరగతి, ఇంటర్‌లో అత్యున్నత ఉత్తీర్ణత సాధించి జిల్లాకే తల మానికంగా..

ఈ సర్కారు బడిలో సీట్లు లేవు!

కొత్తపల్లి, జూలై 2(ఆంధ్రజ్యోతి): ఇది కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలంలోని మూలపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల. ఈ యేడాది పదో తరగతి, ఇంటర్‌లో అత్యున్నత ఉత్తీర్ణత సాధించి జిల్లాకే తల మానికంగా ఈ జెడ్పీ హైస్కూల్‌ ఫ్లస్‌ నిలిచింది. దీంతో ఈసారి అధికసంఖ్యలో విద్యార్థులు పాఠశాలలో చేరారు. ప్రస్తుతం ఉన్న తరగతి గదులు సరిపోక పోవడంతో 7, 8, 9, 10 తరగతులతో పాటు ఇంటర్‌ ఫస్టియర్‌ బైపీసీలో సీట్లు లేవంటూ నో అడ్మిషన్‌ బోర్డు పెట్టారు. 7వ తరగతిలో 168, 8లో 195, 9లో 168, టెన్త్‌లో 180 మంది, ఇంటర్‌ ఫస్టియర్‌ బైపీసీలో 44మంది చేరినట్టు హెచ్‌ఎం శ్రీనివాసరావు వెల్లడించారు.

Updated Date - Jul 03 , 2026 | 06:24 AM