యూరియా, డీఏపీ అమ్మకాలపై ఆంక్షల్లేవు
ABN , Publish Date - May 23 , 2026 | 06:00 AM
రాష్ట్రంలో యూరియా, డీఏపీ అమ్మకాలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. ఖరీఫ్‌లో ఎరువుల వాడకాన్ని ...
అమరావతి, మే 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యూరియా, డీఏపీ అమ్మకాలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. ఖరీఫ్‌లో ఎరువుల వాడకాన్ని తగ్గించేలా ప్రభుత్వం ఆంక్షలు విధించినట్లు రైతు సంఘాలు, కౌలు రైతు సంఘాలు చేస్తున్న ప్రకటనల్లో వాస్తవం లేదని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతి జిల్లాలో సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని పేర్కొంది. మోతాదుకు మించి ఎరువులు వాడితే అంతర్జాతీయ మార్కెట్‌లో మన పంటలకు గిరాకీ తగ్గుతుందనే భావనతో.. వ్యవసాయ శాస్త్రవేత్తల సిఫారసు మేరకే ఎరువులు వాడటం మంచిదని మాత్రమే చెప్పినట్లు స్పష్టం చేసింది.