Share News

21 నెలల్లో ఒక్కపైసా విద్యుత్తు చార్జీలు పెంచలేదు: మంత్రి గొట్టిపాటి

ABN , Publish Date - Mar 26 , 2026 | 03:10 AM

కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తోంది. అందులో భాగమే 21 నెలల పాలనలో ప్రజలపై ఒక్కపైసా విద్యుత్తు చార్జీల భారాన్ని మోపకపోవడం....

21 నెలల్లో ఒక్కపైసా విద్యుత్తు చార్జీలు పెంచలేదు: మంత్రి గొట్టిపాటి

అమరావతి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): ‘కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తోంది. అందులో భాగమే 21 నెలల పాలనలో ప్రజలపై ఒక్కపైసా విద్యుత్తు చార్జీల భారాన్ని మోపకపోవడం’ అని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సుమారు రూ.16 వేల కోట్ల విద్యుత్తు చార్జీల భారాన్ని ప్రజలపై మోపకుండా ప్రభుత్వమే భరించేందుకు సిద్ధమైంది. ప్రజల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. ఇచ్చిన ప్రతి హామీపై మడమ తిప్పిన జగన్‌కు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదు. ఆస్తులు కొల్లగొట్టడం.. వ్యవస్థల విధ్వంసం తప్ప జగన్‌ ఐదేళ్లలో రాష్ట్రానికి చేసిందేమీ లేదు’ అని మంత్రి గొట్టిపాటి విమర్శించారు.

Updated Date - Mar 26 , 2026 | 03:10 AM