CM Chandrababu: అమరావతిని ఎవరూ ఆపలేరు
ABN , Publish Date - Jan 11 , 2026 | 04:12 AM
రాజధాని అమరావతిని ఎవరూ ఆపలేరని ప్రపంచంలో బెస్ట్ సిటీ, మోడల్ సిటీగా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: రాజధాని అమరావతిని ఎవరూ ఆపలేరని ప్రపంచంలో బెస్ట్ సిటీ, మోడల్ సిటీగా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలోని సిద్ధార్థ అకాడమీ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో సీఎం మాట్లాడారు. ప్రపంచం మెచ్చే అమరావతి నిర్మాణ వేగాన్ని చూసి కొందరు అసూయపడుతున్నారన్నారు. అమరావతిని ఆపేస్తామని అనుకుంటున్నారని, గత ఐదేళ్లలో ఆపినందుకు ఏమయ్యారో చూశారని వ్యాఖ్యానించారు. అమరావతిని ఎవరూ ఆపలేరని, మరో రెండేళ్లలో ఒక రూపు వస్తుందని చెప్పారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతి అన్నీ కలిసిపోయి బెస్ట్ లివబుల్ సిటీ, గ్లోబల్ సిటీగా తయారవుతుందన్నారు.