Share News

జగన్‌ ఓడిపోయే వరకు పోరాడా

ABN , Publish Date - May 14 , 2026 | 05:19 AM

రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న నేను రాజ్యాంగానికి అనుగుణంగానే మాట్లాడుతున్నానని రాజకీయంగా మాట్లాడటం లేదని ఏపీ డిప్యూటీ స్పీకర్‌ కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు.

జగన్‌ ఓడిపోయే వరకు పోరాడా

  • ఇక అతని గురించి మాట్లాడటానికి ఏముంటుంది?: డిప్యూటీ స్పీకర్‌ రఘురామ

కాళ్ళ, మే 13(ఆంధ్రజ్యోతి): రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న నేను రాజ్యాంగానికి అనుగుణంగానే మాట్లాడుతున్నానని రాజకీయంగా మాట్లాడటం లేదని ఏపీ డిప్యూటీ స్పీకర్‌ కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. బుధవారం పశ్చి మ గోదావరి జిల్లా కాళ్ళ మండలం పెద అమిరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మహాసేన రాజేశ్‌ నాపై పెట్టిన పోస్ట్‌ను చూశా. జగన్మోహన్‌రెడ్డిని ఇప్పటివరకు ఆర్‌ఆర్‌ఆర్‌ ఎందుకు ఒక్క మాట కూడా అనలేదని రాజేశ్‌ ప్రశ్నించాడు. జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు ఆయన చేసిన రుణాలు, దారుణాల కోసం మాట్లాడాను. ఎలక్షన్‌లో జగన్‌ దారుణంగా ఓడిపోయారు. చంద్రబాబు సీఎం అయ్యారు. ఇంకా నేను జగన్‌పై మాట్లాడటానికి ఏముంటుంది? విజయసాయిరెడ్డి నిమిత్తమాత్రుడు.. ఎవరో మాట్లాడిస్తే మాట్లాడాడు. పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబులతో నాకున్న బంధాన్ని విడదీయాలని కొందరు చూస్తున్నారు. అది ఎప్పటికీ సాధ్యం కా దు. ఆకివీడు ఘటనలో నావైపు న్యాయం ఉంది కాబట్టి కోర్టు న్యాయం చేసింది’ అని తెలిపారు.

కస్టోడియల్‌ టార్చర్‌ కేసును వదిలేయలేదు

‘‘గురువారం నా పుట్టినరోజు. నా కేసుకు రేపటితో ఐదేళ్లు. నా కస్టోడియల్‌ టార్చర్‌ కేసును వదల్లేదు. ఆ కేసును నేను పట్టువదలని విక్రమార్కుడిలా అడుగుతూనే ఉన్నా. 2027 జూన్‌ నెలలో పోలవరం కచ్చితంగా పూర్తయిపోతుందని సీఎం చెప్పారు. అప్పపటికి నా కస్టోడియల్‌ టార్చర్‌ కేసు కూడా పూర్తి చేస్తారేమోనన్న ఆశాభావంతో ఉన్నా’ అని రఘురామ అన్నారు.

Updated Date - May 14 , 2026 | 05:19 AM