గ్రేస్ మార్కులు ఉండవు...!
ABN , Publish Date - Jun 01 , 2026 | 06:04 AM
ఎంబీబీఎస్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) నిబంధనల ప్రకారం ఎలాంటి గ్రేస్ మార్కులూ ఉండవని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ..
ఎన్‌ఎంసీ నిబంధనలు వర్తించవు
‘ఆంధ్రజ్యోతి’ కథనంపై హెల్త్ వర్సిటీ వివరణ
అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): ఎంబీబీఎస్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) నిబంధనల ప్రకారం ఎలాంటి గ్రేస్ మార్కులూ ఉండవని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ సాయి సుధీర్ వెల్లడించారు. ‘ఆంధ్రజ్యోతి’లో ‘‘ఎన్‌ఎంసీ తప్పిదం-వైద్య విద్యార్థులకు శాపం’’ శీర్షికతో ఆదివారం ప్రచురితమైన కథనంపై ఆయన వివరణ ఇచ్చారు. కాంపిటేటివ్ బేస్డ్ పరీక్షా విధానంలో గ్రేస్ మార్కులను ఎన్‌ఎంసీ అమలు చేయడం లేదన్నారు. వైద్య విద్యార్థులు ప్రతి సబ్జెక్టులోనూ థియరీలో 40 శాతం, ప్రాక్టికల్స్‌లో 40 శాతం మార్కులు సాధించాలని, మొత్తంగా ప్రతి సబ్జెక్టులో 50 శాతం మార్కులు రావాలని స్పష్టం చేశారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ సూచనల మేరకు కొత్త పరీక్షా విధానం ప్రవేశపెట్టామని, ఇందులో హెల్త్ యూనివర్సిటీ జోక్యం ఏ మాత్రం లేదన్నారు.