ఫ్లైట్ టికెట్టూ నాదే.. మ్యాచ్ టికెట్టూ నాదే
ABN , Publish Date - Feb 19 , 2026 | 04:30 AM
‘ఫ్లైట్ టికెట్టూ నాదే! మ్యాచ్ టికెట్టూ నాదే! నా దుడ్డుతో నేను మ్యాచ్ చూస్తిని.. నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తినా జగన్’ అని మంత్రి లోకేశ్ ఎక్స్‌లో పోస్టు చేశారు.
నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తినా జగన్: లోకేశ్
అమరావతి, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): ‘ఫ్లైట్ టికెట్టూ నాదే! మ్యాచ్ టికెట్టూ నాదే! నా దుడ్డుతో నేను మ్యాచ్ చూస్తిని.. నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తినా జగన్’ అని మంత్రి లోకేశ్ ఎక్స్‌లో పోస్టు చేశారు. కొలంబోలో జరిగిన భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌కు లోకేశ్ ప్రభుత్వ ధనం వెచ్చించి వెళ్లారని వైసీపీ ప్రచారం చేస్తుండటంపై ఆయన పైవిధంగా స్పందించారు. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, మంత్రి లోకేశ్ తన కొలంబో పర్యటన కోసం ప్రభుత్వ ధనం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, ఇలాంటి అసత్య వార్తలు నమ్మవద్దంటూ ఏపీ గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్ వివరాలను తన పోస్టుకు ట్యాగ్ చేశారు.