సంక్షేమ హాస్టళ్ల మెనూలో రాజీ పడొద్దు: సీఎస్
ABN , Publish Date - Jan 20 , 2026 | 04:55 AM
రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలని, నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని...
అమరావతి, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలని, నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్‌లో ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ‘ప్రతి హాస్టల్‌లో మెనూ ప్రకారమే ఆహారం అందించాలి. పారిశుధ్యం, తాగునీటి వసతులు మెరుగుపర్చాలి. ప్రజల సంతృప్తి స్థాయి ఏ మాత్రం తగ్గకుండా పథకాలు అందించాలి. సంతృప్తి స్థాయి 90శాతం పైగా వచ్చేలా పర్యవేక్షించాలి. మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలి. ఇందుకోసం జిల్లాల్లో పోలీస్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి’ అని సూచించారు.