Share News

నబీన్‌ పర్యటనతో నూతనోత్సాహం: మాధవ్‌

ABN , Publish Date - Aug 20 , 2026 | 03:50 AM

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ విశాఖపట్నం పర్యటన నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు.

నబీన్‌ పర్యటనతో నూతనోత్సాహం: మాధవ్‌

విశాఖపట్నం, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ విశాఖపట్నం పర్యటన నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి జాతీయ అధ్యక్షుడు హాజరుకావడం ఇదే ప్రథమమన్నారు. ఆయన దిశానిర్దేశం మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కించుకోవడానికి బీజేపీ తన వంతు ప్రయత్నం చేస్తుందన్నారు. కాగా, జాతీయ అధ్యక్షుడు పర్యటన ముగించుకుని వెళ్లే ముందు ఆయన్ను హోటల్‌లో బుధవారం ఉదయం విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్‌ కలిశారు. రాష్ట్ర పార్టీ మీడియా బాధ్యులు రూపొందించిన ‘భారత్‌ రైజింగ్‌’ పుస్తకాన్ని మాధవ్‌ సమక్షంలో నితిన్‌కు అందించారు.

Updated Date - Aug 20 , 2026 | 03:51 AM