Share News

అద్భుత ఆంధ్రాను చూడండి

ABN , Publish Date - Apr 22 , 2026 | 05:51 AM

ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకంపై నీతి ఆయోగ్‌ ప్రశంసలు కురిపించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల వైవిధ్య భరితమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సహజ సౌందర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ...

అద్భుత ఆంధ్రాను చూడండి

  • పర్యాటక వైవిధ్యం.. సాంస్కృతిక వైభవం ఏపీ సొంతం

  • ‘దివ్య భారత్‌’లో ప్రపంచానికి పరిచయం చేసిన నీతి ఆయోగ్‌

  • పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్‌ హర్షం

అమరావతి, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకంపై నీతి ఆయోగ్‌ ప్రశంసలు కురిపించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల వైవిధ్య భరితమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సహజ సౌందర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ విడుదల చేసిన ‘దివ్య భారత్‌ - ఏ విండో టు ది సోషల్‌ ఆఫ్‌ ఇండియా’ నివేదికలో రాష్ట్ర పర్యాటక రంగానికి నీతి ఆయోగ్‌ పెద్దపీట వేసింది. మంగళవారం విడుదల చేసిన 13 పేజీల సమగ్ర నివేదిక, 1.20 నిమిషాల నిడివి ఉన్న ప్రత్యేక వీడియో ద్వారా ఏపీ పర్యాటక గమ్యస్థానాలను ప్రపంచానికి పరిచయం చేసింది. ఏపీని సందర్శించేందుకు అక్టోబరు నంచి ఫిబ్రవరి వరకు అత్యంత అనువైన సమయని పేర్కొన్న నీతి ఆయోగ్‌, ఏయే నెలల్లో ఏ ప్రాంతాలను సందర్శించాలో ఈ నివేదికలో విపులంగా వివరించింది. నీతి ఆయోగ్‌ నివేదికపై పర్యాటక మంత్రి కందుల దుర్గేష్‌ హర్షం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో ప్రపంచ పర్యాటక చిత్రపటంపై ఏపీ వైభవంగా వెలుగుతోందన్నారు. 2030 నాటికి దేశంలోనే అగ్రగామి పర్యాటక రాష్ట్రంగా ఏపీని నిలుపుతామని చెప్పారు.

Updated Date - Apr 22 , 2026 | 05:52 AM