Share News

డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌గా నిరంజన్‌

ABN , Publish Date - May 13 , 2026 | 04:58 AM

రాష్ట్ర హైకోర్టులో డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌(డీఎస్జీ)గా న్యాయవాది తేనెపల్లి నిరంజన్‌ నియమితులయ్యారు

డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌గా నిరంజన్‌

అమరావతి, మే 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టులో డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌(డీఎస్జీ)గా న్యాయవాది తేనెపల్లి నిరంజన్‌ నియమితులయ్యారు. డీఎస్జీ హోదాలో ఆయన కేంద్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో వాదనలు వినిపించనున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఉత్తర్వులు జారీ అయిన నాటి నుంచి మూడేళ్లపాటు ఆయన డీఎ్‌సజీ పోస్టులో కొనసాగనున్నారు. గతంలో డీఎస్జీగా వ్యవహరించిన పసల పొన్నారావు అనారోగ్యంతో మరణించడంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా నిరంజన్‌ను ఆ పోస్టులో నియమించింది. బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు.

Updated Date - May 13 , 2026 | 04:58 AM