Share News

మీ రాక్షస పాలన తట్టుకోలేకే 11 సీట్లిచ్చారు: నిమ్మల

ABN , Publish Date - Jan 29 , 2026 | 04:31 AM

జగన్‌ రాక్షస పాలనను తట్టుకోలేక 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఆయన పార్టీని 151 స్థానాల నుంచి 11 స్థానాలకు దించేశారని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

మీ రాక్షస పాలన తట్టుకోలేకే 11 సీట్లిచ్చారు: నిమ్మల

అమరావతి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): జగన్‌ రాక్షస పాలనను తట్టుకోలేక 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఆయన పార్టీని 151 స్థానాల నుంచి 11 స్థానాలకు దించేశారని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఎన్నికల ముందు నిర్మాణం పూర్తికాకుండానే వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితమిచ్చి.. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలను ఆయన మోసగించారని ధ్వజమెత్తారు. ఈ మోసాన్ని గుర్తించే ఆయా జిల్లాల ప్రజలు వైసీపీకి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. బుధవారం ఆయన వెలగపూడి సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఏడాదిన్నరలో వెలిగొండ కోసం రూ.570.85 కోట్లు వ్యయం చేశామని.. ఫీడర్‌ కెనాల్‌ లైనింగ్‌ పనులు, వాల్స్‌కు రూ.456 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. వారం రోజుల్లో ప్రాజెక్టును ముఖ్యమంత్రి సందర్శిస్తారని.. ఈ ఏడాది దానిని పూర్తిచేస్తామని స్పష్టం చేశారు.

Updated Date - Jan 29 , 2026 | 04:31 AM