డాక్టర్ ఇండ్లకు నిమ్‌హాన్స్ సత్కారం
ABN , Publish Date - Sep 19 , 2026 | 06:15 AM
విజయవాడకు చెందిన ప్రముఖ మానసిక వైద్యుడు, ఇండ్లాస్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డికి అరుదైన గౌరవం దక్కింది.
సైకియాట్రీలో సేవలకు అరుదైన గౌరవం
విజయవాడ(భారతీనగర్), సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): విజయవాడకు చెందిన ప్రముఖ మానసిక వైద్యుడు, ఇండ్లాస్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. బెంగుళూరులోని నిమ్‌హాన్స్‌లో సైకియాట్రీ పీజీ కోర్సు ప్రారంభమై 71 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తొలిసారిగా నిర్వహించిన ఫౌండేషన్ డే వేడుకల్లో ఆయనను శుక్రవారం ఘనంగా సత్కరించారు. 1977 నుంచి 1982 వరకు నిమ్‌హాన్స్‌లో సైకియాట్రీలో శిక్షణ పొందిన డాక్టర్ ఇండ్ల అనంతరం అమెరికాలోని క్రైసిస్ మెడికల్ కాలేజీలో, పుదుచ్చేరిలోని జిప్‌మర్‌లో సేవలందించారు. వైద్య వృత్తితోపాటు రచనలు, ఉపన్యాసాల ద్వారా మానసిక అనారోగ్యంపై ప్రజల్లో ఉన్న అపోహలు, మూఢనమ్మకాలను తొలగించేందుకు ఆయన కృషి చేశారు. మానసిక సమస్యలపై అవగాహన కల్పించడంతోపాటు మన బంధు సంస్థ ట్రస్టీగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయన సామాజిక సేవలను గుర్తించి ఈ సత్కారం అందించినట్లు నిర్వాహకుల తెలిపారు. కార్యక్రమంలో నిమ్‌హాన్స్ డైరక్టర్ డాక్టర్ వై.ఎన్.జానార్దన్‌రెడ్డి, సైకియాట్రీ విభాగాధిపతి డాక్టర్ జగదీశ్, జాతీయ మెడికల్ కౌన్సిల్ మాజీ చైర్మన్ డాక్టర్ బి.ఎన్ గంగాధర్, నిమ్‌హాన్స్ మాజీ డైరక్టర్ డాక్టర్ ఎన్.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.