ఎన్‌ఐఏ కస్టడీకి ఉగ్ర నిందితులు
ABN , Publish Date - Jun 07 , 2026 | 06:23 AM
బెనెక్స్ కామ్ గ్రూపు ద్వారా ఉగ్రవాద సాహిత్యాన్ని, ఉగ్రవాద సంస్థల నాయకుల ప్రసంగాలను ప్రచారం చేసిన కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న 11 మంది నిందితులను విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు..
11 మందిని 3 రోజుల కస్టడీకి ఇచ్చిన కోర్టు
విజయవాడ, జూన్ 6: బెనెక్స్ కామ్ గ్రూపు ద్వారా ఉగ్రవాద సాహిత్యాన్ని, ఉగ్రవాద సంస్థల నాయకుల ప్రసంగాలను ప్రచారం చేసిన కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న 11 మంది నిందితులను విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు మూడు రోజులపాటు ఎన్‌ఐఏ కస్టడీకి ఇచ్చింది. దీనికి సం బంధించి ఇన్‌చార్జి న్యాయాధికారి ఎల్.తేజోవతి శనివారం తీర్పు ఇచ్చారు. కొత్తపేట పోలీసుల ు నమోదు చేసిన ఈ కేసు కొద్దిరోజుల క్రితం ఎన్‌ఐఏకు బదిలీ అయింది. నింది తులు రెహ్మతుల్లా షరీఫ్, మహ్మద్ డానిష్, సొహైల్ బేగ్, షద్మాన్ దిల్కష్, సయిదా బేగం, లక్కీ అహ్మద్, జిషాన్ అబ్దుల్ మాజిద్, మిర్ ఆసిఫ్ అలీ, అబ్దుల్ సలాం, షారూ ఖ్ ఖాన్, షేక్ ఫైజ్ ఉర్ రెహ్మా న్‌లను వారం రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని ఎన్‌ఐఏ అధికారులు మూడ్రోజుల క్రితం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయాధికారి తేజోవతి తీర్పును వెలువరించారు.