Share News

ఉగ్ర సానుభూతిపరులకు 18 వరకు రిమాండ్‌ పొడిగింపు

ABN , Publish Date - Jun 17 , 2026 | 06:12 AM

బెనెక్స్‌ కామ్‌ గ్రూపు ద్వారా ఉగ్రవాద సాహిత్యాన్ని, ఆయా సంస్థల నేతల ప్రసంగాలను ప్రచారం చేసిన కేసులో..

ఉగ్ర సానుభూతిపరులకు 18 వరకు రిమాండ్‌ పొడిగింపు

విజయవాడ, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): బెనెక్స్‌ కామ్‌ గ్రూపు ద్వారా ఉగ్రవాద సాహిత్యాన్ని, ఆయా సంస్థల నేతల ప్రసంగాలను ప్రచారం చేసిన కేసులో ఉన్న 11 మంది నిందితులకు ఎన్‌ఐఏ కోర్టు 18వ తేదీ వరకు రిమాండ్‌ పొడిగించింది. రిమాండ్‌ గడువును 90 నుంచి 180 రోజులకు పెంచాలని ఎన్‌ఐఏ అధికారులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై కౌంటర్‌ చేయాలని విచారణను అదే రోజుకు వాయిదా వేసింది.

Updated Date - Jun 17 , 2026 | 06:12 AM