తెనాలిలో ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్మన్, హైకోర్టు సీజే
ABN , Publish Date - May 01 , 2026 | 04:08 AM
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప తెనాలిలోని తన నివాసంలో గురువారం ఏర్పాటుచేసిన ప్రత్యేక పూజా కార్యక్రమానికి జాతీయ..
తెనాలి, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప తెనాలిలోని తన నివాసంలో గురువారం ఏర్పాటుచేసిన ప్రత్యేక పూజా కార్యక్రమానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ రామసుబ్రహ్మణియన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ హాజరయ్యారు. 15 మందికి పైగా హైకోర్టు న్యాయమూర్తులు కూడా పాల్గొన్నారు. వారికి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి, తహసీల్దార్ గోపాలకృష్ణ స్వాగతం పలికారు. కాగా.. తెనాలి వచ్చిన జస్టిస్ రామసుబ్రహ్మణియన్ పెదరావూరులోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం వరకు ఆయన తెనాలిలోనే ఉంటారని, శుక్రవారం కూడా జస్టిస్ వెంకట జ్యోతిర్మయి నివాసంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని శక్రవారం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళతారని అధికార వర్గాలు వెల్లడించాయి.