Vedirere Sriram: సీమ లిఫ్టును ఆపింది ఎన్‌జీటీయే!
ABN , Publish Date - Jan 07 , 2026 | 03:03 AM
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపింది మేమంటే మేమని తెలంగాణలోని అధికార, విపక్షాలు వాదులాడుకుంటున్న తరుణంలో..
జలశక్తి శాఖ మాజీ సలహాదారు వెదిరె శ్రీరాం వెల్లడి
హైదరాబాద్, జనవరి 6(ఆంధ్రజ్యోతి): రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపింది మేమంటే మేమని తెలంగాణలోని అధికార, విపక్షాలు వాదులాడుకుంటున్న తరుణంలో.. కేంద్ర జలశక్తి శాఖ మాజీ సలహాదారు, ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వ అడ్వయిజర్‌గా ఉన్న బీజేపీ నేత వెదిరె శ్రీరాం దీనిపై స్పందించారు. ఈ పథకాన్ని ఎవరూ ఆపలేదని.. జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) ఆపిందని తెలిపారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో కృష్ణా, గోదావరి జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ పై వ్యాఖ్యలు చేశారు. పోలవరం-నల్లమలసాగర్ అనుసంధాన పథకానికి సంబంధించి ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదిక (పీఎ్‌ఫఆర్)ను మాత్రమే ఏపీ ప్రభుత్వం కేంద్ర జలసంఘానికి ఇచ్చిందని.. డీపీఆర్ కాదని స్పష్టం చేశారు. ఏ సాగునీటి ప్రాజెక్టుకైనా హైడ్రాలిక్, పర్యావరణ అనుమతులు కీలకమని.. కానీ తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఈ రెండు క్లియరెన్సులూ రాలేదన్నారు. కానీ సీఎ్‌సఎంఆర్‌ఎస్, గిరిజన శాఖ, కేంద్ర భూగర్భ జలాల బోర్డు (సీజీడబ్ల్యుబీ), సీఈఏ వంటి క్లియరెన్సులు సాధించినట్లు బీఆర్‌ఎస్ ప్రచారం చేసుకుందని ఆక్షేపించారు. ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్రం తిరస్కరించలేదని.. కచ్చితమైన వివరాలు మాత్రమే కోరిందని.. వాటని అందిస్తే డీపీఆర్‌కు ఆమోదం లభిస్తుందని చెప్పారు.