Share News

అమరావతిలో ఎన్‌ఎఫ్‌డీబీ ప్రాంతీయ కార్యాలయం

ABN , Publish Date - Apr 08 , 2026 | 04:11 AM

జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్‌ఎఫ్‌డీబీ)ప్రాంతీయ కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేయడానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

అమరావతిలో ఎన్‌ఎఫ్‌డీబీ ప్రాంతీయ కార్యాలయం

  • చంద్రబాబు లేఖ.. కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌

అమరావతి, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్‌ఎఫ్‌డీబీ)ప్రాంతీయ కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేయడానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఏపీ ఆక్వాకల్చర్‌ రాష్ట్రంగా ఉన్నందున అమరావతిలో ఎన్‌ఎ్‌ఫడీబీ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు కేంద్రం సుముఖత తెలిపింది. రాష్ట్రంలో ఎన్‌ఎ్‌ఫడీబీ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం వల్ల మత్స్య రంగ అభివృద్ధిలో కీలకం కానున్నది. ఆక్వాలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన సాగు పద్ధతులు, నాణ్యమైన విత్తనం, దాణా నిర్వహణ, మార్కెటింగ్‌, వ్యాధుల నియంత్రణపై శిక్షణ మత్స్యకారులకు చేరువకావడంతోపాటు కొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఎన్‌ఎ్‌ఫడీబీ ప్రాంతీయ కార్యాలయాన్ని రాజదానిలో ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు లేఖ రాసినందునే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి అచ్చెన్నాయుడు మంగళవారం తెలిపారు. ఈ కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలని కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్‌ రంజన్‌సింగ్‌ లేఖ రాసినట్లు అచ్చెన్న తెలిపారు.

Updated Date - Apr 08 , 2026 | 04:11 AM