Share News

టాయిలెట్‌లో పసికందు

ABN , Publish Date - Apr 12 , 2026 | 04:51 AM

పబ్లిక్‌ టాయిలెట్‌లో ఓ మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చి, బిడ్డను అక్కడే వదిలి వెళ్లింది. విజయవాడలోని కృష్ణలంక పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో జాతీయ రహదారి పక్కనున్న మరుగుదొడ్డిలో శనివారం తెల్లవారుజామున జరిగిందీ దారుణం.

టాయిలెట్‌లో పసికందు

  • ఆడ శిశువును ప్రసవించి.. అక్కడే వదిలి వెళ్లిన మహిళ

విజయవాడ(కృష్ణలంక), ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): పబ్లిక్‌ టాయిలెట్‌లో ఓ మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చి, బిడ్డను అక్కడే వదిలి వెళ్లింది. విజయవాడలోని కృష్ణలంక పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో జాతీయ రహదారి పక్కనున్న మరుగుదొడ్డిలో శనివారం తెల్లవారుజామున జరిగిందీ దారుణం. మరుగుదొడ్డిలోనే శిశువును వదిలి, బకెట్‌ అడ్డుగా పెట్టి మహిళ వెళ్లిపోయింది. ఉదయం 6 గంటలకు శుభ్రం చేసేందుకు వచ్చిన శానిటరీ సిబ్బంది పసికందును చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు శిశు సంరక్షణ(ఆశా) సిబ్బందిని పిలిపించి శిశివును పాత ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. మహిళ పంజాబీ డ్రెస్‌ ధరించి పొట్టిగా ఉన్నట్లు సులభ కాంప్లెక్స్‌ నిర్వహిస్తున్న వలపర్ల రాధా తెలిపారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా మహిళను తీసుకొచ్చిన ఆటోడ్రైవర్‌ను పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. మహిళ అదే ఆటోలో రైల్వేస్టేషన్‌కు వెళ్లి రైలు ఎక్కి ఎటో వెళ్లిపోయినట్లు సమాచారం.

Updated Date - Apr 12 , 2026 | 04:53 AM