తిరుమలలో ‘సెల్‌కాన్’ అతిథిగృహం.!
ABN , Publish Date - Mar 26 , 2026 | 03:50 AM
తిరుమలలో భక్తులకు వసతి కోసం మరొక అతిథిగృహం అందుబాటులోకి వచ్చింది. సెల్‌కాన్ గ్రూప్ నిర్మించిన ‘సింహ నిలయం’ గెస్ట్‌హౌస్‌ను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, జేఈఓ వెంకయ్య చౌదరి బుధవారం ప్రారంభించారు.
ప్రారంభోత్సవంలో పాల్గొన్న టీటీడీ అధికారులు, సంస్థ ప్రతినిధులు
తిరుమల, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో భక్తులకు వసతి కోసం మరొక అతిథిగృహం అందుబాటులోకి వచ్చింది. సెల్‌కాన్ గ్రూప్ నిర్మించిన ‘సింహ నిలయం’ గెస్ట్‌హౌస్‌ను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, జేఈఓ వెంకయ్య చౌదరి బుధవారం ప్రారంభించారు. ఈ అతిథిగృహాన్ని సెల్‌కాన్ గ్రూప్ అధినేత వై.గురుస్వామి నాయుడు, హేమలత దంపతులు.. జేఈఓ కార్యాలయం సమీపంలో అధునాతన వసతులతో నిర్మించారు. అతిథిగృహం ప్రారంభోత్సవం సందర్భంగా జేఈఓ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, కొత్తగా నిర్మించిన గెస్ట్‌హౌస్‌లోని గదులను, తిరుమల వచ్చే భక్తులకు టీటీడీ ట్రస్ట్ ద్వారా కేటాయించనున్నట్టు తెలిపారు. సెల్‌కాన్ అధినేత గురుస్వామి నాయుడు మాట్లాడుతూ, తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో అద్భుతమైన అతిథిగృహాన్ని నిర్మించే అవకాశం రావడం తమకు లభించిన అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. బుధవారమే ఈ గెస్ట్‌హౌస్‌ను టీటీడీకి అందజేస్తున్నట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సెల్‌కాన్ గ్రూప్ డైరెక్టర్ రేతినేని మురళీకృష్ణ, కొణిజేటి పవన్‌కుమార్, టీటీడీ డిప్యూటీ ఈవో భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.