Share News

బార్‌ కౌన్సిల్‌ కొత్త సభ్యులకు సన్మానం

ABN , Publish Date - Mar 31 , 2026 | 06:12 AM

ఏపీ బార్‌ కౌన్సిల్‌కు కొత్తగా ఎన్నికైన 8 మంది సభ్యులను హైకోర్టు న్యాయవాదుల సంఘం ఘనంగా సన్మానించింది.

బార్‌ కౌన్సిల్‌ కొత్త సభ్యులకు సన్మానం

అమరావతి, మార్చి 30(ఆంధ్రజ్యోతి): ఏపీ బార్‌ కౌన్సిల్‌కు కొత్తగా ఎన్నికైన 8 మంది సభ్యులను హైకోర్టు న్యాయవాదుల సంఘం ఘనంగా సన్మానించింది. హైకోర్టులో ప్రాక్టీస్‌ చేస్తూ బార్‌ కౌన్సిల్‌కు ఎన్నికైన న్యాయవాదులు కలిగినీడి చిదంబరం, బాలాజీ యలమంజుల, శ్రీనివాసులరెడ్డి కొమ్మసాని, ఎన్‌వీ సుమంత్‌, గంటా రామారావు, వీఆర్‌రెడ్డి కొవ్వూరి, మాధవి రోళ్ల, శ్రీదేవి జంపనిలను శాలువాతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ చల్లా ధనంజయ, సీనియర్‌ న్యాయవాదులు, న్యాయవాదులు, అడ్వొకేట్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు కేవీ రఘువీర్‌, జనరల్‌ సెక్రెటరీ సి.సుబోధ్‌, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Mar 31 , 2026 | 06:13 AM