అమరావతిలో మరో ఫైవ్‌స్టార్ హోటల్!
ABN , Publish Date - Mar 30 , 2026 | 04:38 AM
అమరావతికి మరో ఫైవ్ స్టార్ హోటల్ రానుంది. శాఖమూరులో క్రౌన్ ప్లాజా ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మాణ పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు.
తుళ్లూరు, మార్చి 29(ఆంధ్రజ్యోతి): అమరావతికి మరో ఫైవ్ స్టార్ హోటల్ రానుంది. శాఖమూరులో క్రౌన్ ప్లాజా ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మాణ పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఇండ్రాయల్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ కన్సార్టియం వారు ఈ నిర్మాణం చేపట్టారు. రూ.300 కోట్లతో 4 ఎకరాలలో 200 గదులు ఉండేలా ఈ హోటల్‌ను నిర్మించనున్నారు. 500 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆ సంస్థ ప్రతినిధులు, సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు.