4 జిల్లాలకు కొత్త కలెక్టర్లు
ABN , Publish Date - Mar 30 , 2026 | 04:35 AM
రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. ఏపీఐఐసీ ఎండీగా ఉన్న ఎం.అభిషిక్త్ కిశోర్‌ను విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌గా నియమించింది.
విశాఖకు ఎం.అభిషిక్త్ కిశోర్
అమరావతి, మార్చి 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. ఏపీఐఐసీ ఎండీగా ఉన్న ఎం.అభిషిక్త్ కిశోర్‌ను విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌గా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖపట్నం కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎంఎన్ హరేంధిర ప్రసాద్‌ను కాకినాడ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేసింది. కాకినాడ జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఎస్.షన్మోహన్‌ను ఈడీబీ(ఎకనమిక్ డెవల్‌పమెంట్ బోర్డు) ఎండీగా నియమించింది. ఈడీబీ ఎండీగా విధులు నిర్వహిస్తున్న సి.ఎం.సాయికాంత్ వర్మను గుంటూరు జిల్లాకు కలెక్టరుగా బదిలీ చేసింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న తమీమ్ అన్సారీయాను పాఠశాల విద్యా డైరెక్టర్‌గా బదిలీ చేసింది. కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టీ నిశాంతిని, అల్లూరి సీతారామరాజు జిల్లాకు కలెక్టర్‌గా నియమించింది. అక్కడ కలెక్టర్‌గా ఉన్న ఏఎస్ దినేశ్ కుమార్‌ను, ఏపీఐఐసీ(ఆంధ్రప్రదేశ్ ఇండస్ర్టియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) ఎండీగా నియమించింది. అలానే కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలతో ఏర్పాటు చేసుకోవడానికి కలెక్టర్‌ను ఆదేశిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.