నేతన్నకు ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్
ABN , Publish Date - Feb 15 , 2026 | 06:02 AM
రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కార్మికులకు కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించనుంది.
అమరావతి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కార్మికులకు కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించనుంది. ఎన్నికల సమయంలో చేనేతలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అందులో భాగంగా రాష్ట్రంలో అర్హులైన నేత కుటుంబాల ఎంపిక పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో నేతన్నల ఉచిత విద్యుత్‌కు సంబంధించి నిధులు కేటాయించడంతో ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం అమల్లోకి రాబోతోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై నేతన్నల కుటుంబాల తరపున చేనేత జౌళి శాఖ మంత్రి సవిత.. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.