ఐస్‌క్రీమ్ అమ్మితే రూ.3 వేల జరిమానా
ABN , Publish Date - Apr 02 , 2026 | 04:16 AM
ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం నెమలిపేట గిరిజనులు తమ పిల్లల ఆరోగ్యం దృష్ట్యా ఐస్‌క్రీమ్ అమ్మకాలపై నిషేధం విధించారు.
పిల్లల ఆరోగ్యం దృష్ట్యా గిరిజన తండాలో నిషేధం
కుక్కునూరు, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం నెమలిపేట గిరిజనులు తమ పిల్లల ఆరోగ్యం దృష్ట్యా ఐస్‌క్రీమ్ అమ్మకాలపై నిషేధం విధించారు. గ్రామంలో ఎవరైనా ఐస్‌క్రీమ్ అమ్మితే రూ.3 వేలు, కొన్నవారికి రూ.వెయ్యి జరిమానా వేస్తామని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. వేసవి నేపథ్యంలో పిల్లలు, పెద్దలు చల్లని పదార్థాలకు ఆకర్షితులవుతుంటారు. ఈ క్రమంలో ఐస్‌క్రీమ్ తింటే తలనొప్పి, దగ్గు, జలుబు, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని, అందుకే నిషేధిస్తున్నట్టు గ్రామస్థులు తెలిపారు.