Share News

నెల్లూరులో యువగళం విజయోత్సవ ర్యాలీలు

ABN , Publish Date - Jan 28 , 2026 | 06:06 AM

సరిగ్గా మూడేళ్ల క్రితం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విజయవంతంగా సాగించిన యువగళం పాదయాత్రను స్మరించుకుంటూ నెల్లూరు జిల్లాలో...

నెల్లూరులో యువగళం విజయోత్సవ ర్యాలీలు

నెల్లూరు, జనవరి 27(ఆక్టోబరు): సరిగ్గా మూడేళ్ల క్రితం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విజయవంతంగా సాగించిన యువగళం పాదయాత్రను స్మరించుకుంటూ నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం శ్రేణులు మంగళవారం భారీగా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాయి. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, నెల్లూరు నగర ఇన్‌చార్జి మేయర్‌ రూప్‌కుమార్‌ యాదవ్‌, రూరల్‌ సమన్వయకర్త కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, వాటర్‌వేస్‌ చైర్మన్‌ జెడ్‌. శివప్రసాద్‌ సారథ్యంలో నెల్లూరు పుర వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. సాయంత్రం మంత్రి నారాయణ ఆదేశాలతో నెల్లూరు సిటీ పరిధిలో జరిగిన ర్యాలీలో రూప్‌కుమార్‌ యాదవ్‌, టీడీపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్సీ రవిచంద్ర ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కావలి ఎమ్మెల్యే ‘కావ్య’ కృష్ణారెడ్డి నేతృత్వంలో కావలి నుంచి కొత్తూరు వరకు పాదయాత్ర జరిగింది. గూడూరులో టీడీపీ నాయకులు ర్యాలీ నిర్వహించగా, లోకేశ్‌ ఫ్లెక్సీకి డ్రోన్‌ సాయంతో పాలాభిషేకం చేశారు.

Updated Date - Jan 28 , 2026 | 06:06 AM