Share News

ఒకే రోజు 27 కోట్ల విలువైన 240 పనుల ప్రారంభోత్సవాలు

ABN , Publish Date - Mar 17 , 2026 | 05:58 AM

కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధితో నెల్లూరురూరల్‌ నియోజకవర్గం పోటీపడుతోందని ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి అన్నారు.

ఒకే రోజు 27 కోట్ల విలువైన 240 పనుల ప్రారంభోత్సవాలు

  • నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి

నెల్లూరురూరల్‌, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధితో నెల్లూరురూరల్‌ నియోజకవర్గం పోటీపడుతోందని ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి అన్నారు. సోమవారం నెల్లూరులోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రూ.27 కోట్లతో 240 అభివృద్ధి పనులను కేవలం 60 రోజుల్లో పూర్తి చేసినట్టు చెప్పారు. వీటిని ఈ నెల 22న రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రారంభిస్తారని వెల్లడించారు. 240 ప్రాంతాల్లో పూర్తయిన పనులను స్థానిక టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు సంయుక్తంగా పాల్గొని స్థానిక ప్రజలే ముఖ్యఅతిథులుగా ఏకకాలంలో ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. సీఎం స్ఫూర్తితో తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పరుగులు తీయిస్తున్నామని శ్రీధర్‌ రెడ్డి వెల్లడించారు.

Updated Date - Mar 17 , 2026 | 05:59 AM