ప్రజలకు జగన్ క్షమాపణలు చెప్పాలి: కోటంరెడ్డి
ABN , Publish Date - Jul 08 , 2026 | 03:58 AM
హిందువుల మతవిశ్వాసాలను కించపరుస్తూ, హిందూ దేవుళ్లను నోటికొచ్చినట్లు తిట్టిన ప్రశ్న జోసెఫ్ రావణ్‌ను జగన్మోహన్‌రెడ్డి సమర్థించడం దుర్మార్గమని నెల్లూరు రూరల్..
నెల్లూరు, జూలై 7(ఆంధ్రజ్యోతి): హిందువుల మతవిశ్వాసాలను కించపరుస్తూ, హిందూ దేవుళ్లను నోటికొచ్చినట్లు తిట్టిన ప్రశ్న జోసెఫ్ రావణ్‌ను జగన్మోహన్‌రెడ్డి సమర్థించడం దుర్మార్గమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో హిందువులు, దేవుళ్లు, దేశంపై ప్రశ్న జోసెఫ్ రావణ్ చేసిన, జగన్ సమర్థించిన వ్యాఖ్యలను స్ర్కీన్‌పై చూపించారు.